కడప జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ నందు జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్నా అటెండర్, వాచ్ మెన్, శానిటరీ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తు కోరడమైనది. ఈ దరఖాస్తు మే 16వ తేదీ నుండి మే 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అభ్యర్థులు దరఖాస్తులను రిజిస్టర్ పోస్టు ద్వారా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కడప కార్యాలయంలో ఏర్పాటు చేసిన అప్లికేషన్ డ్రాప్ బాక్స్ నందు వేయవలసిందిగా కోరడమైనది. అప్లికేషన్లను డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. కడప. ఏపీ. జిఓవి. ఇన్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్ ఉంచడం జరిగింది. కావున అర్హత కలిగిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలియజేశారు.

Telegram Group
Whatsapp Group
జాబ్స్ వివరాలు మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి
0 comments
Post a Comment
Thank You for your comment