Tuesday, April 5, 2022

Kadapa Jobs | కడప కోటిరెడ్డి రామసుబ్బమ్మ కాలేజీలో లెక్షరర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ

2022 ఏప్రిల్ నెల 6 వ తేదీన కడప పట్టణంలోని ఎస్ కే ఆర్ & ఎస్ కే ఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జువాలజీ బోధకులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బలక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. జువాలజీ విభాగంలో బోధించేందుకు అర్హులైన మహిళా అభ్యర్థులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇంగ్లీషు, తెలుగు మాధ్యమాలలో బోధించేందుకు ఎంఎస్సి జువాలజీ లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని ఆమె తెలిపారు. సెట్, నెట్, పీహెచ్డీ ఉన్నవారు 6వ తేదీన జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బలక్ష్మమ్మ తెలిపారు.


0 comments

Post a Comment

Thank You for your comment